Bhogi pandla paata
భోగి పండ్లను పోయరె
భోగి పండ్లను పోయరే రమనులార
చిన్ని శిశువుల మీరు దీవించరే
గొబ్బియ్యాల్లో గొబ్బియ్యల్లో గొబియ్యల్లో
గౌరమ్మ దేవించే గొబ్బియ్యల్ల్లో
కుంకుమ తిలకము దిద్దరే కొమ్మలార
కమ్మని కథలని చెప్పి అలరించరే
గంధాక్షితలను వెయ్యరే ఇంతులార
దీర్ఘాయువునిమ్మని దీవించరే
ముమ్మారు దిష్టి తిప్పరే ముదితలార
నల్లరాతి దిష్టినీ నులిమెయ్యరే
మంగళ హారతులివ్వరే అమ్మలార
ముగ్గు..రమ్మల దీవెనలందించరే
28-nov-2022
లక్ష్మి చంద్రిక
#bhogipandlu #భోగి #dhanurmasam #godadevi #godakalyanam #రేగుపండ్లు #హారతి #harathisongs #mangalaharathulu #mangalaharathi
コメント