“పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే ||”
మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.
ఎన్నో జన్మలు ఎత్తిన మనం చిట్టచివరికి ఈ మానవ జన్మలో భగవంతుడి యొక్క మార్గంలో నడిచే ఒక అవకాశం వచ్చింది. ధర్మాన్ని ఆచరణ చేయటం చేత, భగవంతుడికి భక్తి చేసుకోవటం చేత ఈ మానవ జన్మను సార్థకం చేసుకొని తరించవచ్చు.
“సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ |
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||”
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.
#pranavanandadas #iskcontelugu #telugulectures #telugu #spirituality #wisdom #motivation #iskcon #telugureels #motivationalreels
#bhakti #devotion #devotionalservice #cycle of birth and death #bhajagovindam #rebirth
コメント